..ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతున్న సమయంలో..
దొంగలు తుపాకీలు చూపిస్తూ మీరు కదిలితే చంపేస్తాం అని బ్యాంకులో ఉన్న వారిని బెదిరించారు..
ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది,
కానీ మీ ప్రాణాలు మీకు సంబంధించినవి
కనుక మీరు ప్రశాంతంగా ఉంటే మా పని మేము చేసుకుని పోతాం అని చెప్పారు
"మనసు మార్చే మాటలంటే ఇవే"

దొంగలను పక్కదారి పట్టించాలని ఒక స్త్రీ
అనాగరికంగా ప్రవర్తించడంతో అందులో ఒక దొంగ మేము దొంగతనానికి వచ్చాము కానీ అత్యాచారం చేయడానికి రాలేదు అని ఆమెను భయపెట్టాడు..

"దీన్నే అంటారు చేసే పనిలో నిమగ్నత అవసరం అని"
దొంగలు దొంగతనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. అందులో ఒక దొంగ డబ్బును లెక్క పెడదాం అని చెప్పడంతో అందులో ఒకడు
ఎందుకు ఎంత డబ్బు పోయింది అన్నది
ప్రభుత్వం ప్రకటిస్తుందిలే అని అన్నాడు..

"దీన్నే అంటారు చదువు కన్నా అనుభవం గొప్పది అని"
బ్యాంక్ అధికారి దొంగతనం జరిగిన విషయాన్నీ పోలీసులకు కన్నా ముందు అతని పై అధికారికి చెప్పగా బ్యాంకులో దొంగతనం జరిగింది 20 కోట్లు మనం ఇంకో 30 కోట్లు పంచుకుని మొత్తం
50 కోట్లు దొంగతనం జరిగిందని చెపుదాం అన్నాడు ఆ అధికారి..
"దీన్నే అంటారు అసంధర్భాన్ని కూడా మనకు ఉపయోగరంగా (అవకాశంగా) మార్చుకోవడం అని"

ఇది విన్న ఒక అధికారి ప్రతీ సంవత్సరం ఇలాంటి దొంగతనం జరిగితే బాగుంటుంది అని అనుకున్నాడు..

"ఇదే స్వార్థం అంటే"
దొంగతనం జరిగిన ￰మరుసటి రోజు వార్తల్లో బ్యాంకులో 100 కోట్లు దొంగతనం జరిగినట్లుగా ఆ రాష్ట ముఖ్యమంత్రి ప్రకటించారు...
అంటే ఆ ముఖ్యమంత్రి వాటా 50 కోట్లు..

ఆశ్చర్యపోయిన దొంగలు డబ్బుని లెక్కపెట్టారు..
మొత్తం 20 కోట్లు ఉన్నాయి..
అదేంటి మనం 20 కోట్లు దొంగతనం చేస్తే మిగిలిన 80 కోట్లు ఎవరు దొంగతనం చేశారు అని ఆశ్చర్యపోయారు..

దొంగలకి విషయం అర్థం అయింది,
దొంగల్లో ఒకడికి ఆవేశం కట్టలు తెంచుకున్నాయి..
మనం మన ప్రాణాలు పణంగా పెట్టి 20 కోట్లు దొంగతనం చేస్తే, వీళ్ళు దొరల్లా 80 కోట్లు దోచుకున్నారు అని,
"చదువు అవసరం ఇప్పుడు తెలిసింది" అని అన్నాడు

మన భారతదేశం ఇలాంటి దొంగల చేతుల్లోనూ, అధికారుల మాటల్లోనూ, రాజకీయ నాయకుల పాలనలోనూ నడుస్తున్నది..

ఒక రోజు ఒక రాజకీయ నేత పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అప్పుడు ఎంపీ కృపాలాని ఎదురై ఇలా అన్నారు..
కృపాలాని: ఏంటి sir ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నరేంటి..

రాజకీయ నేత : ఈ భారత దేశంలో రాణుల కడుపులో నుంచి రాజులు పుట్టటం చూసాం కానీ నేను రాణుల కడుపులో నుంచి కాకుండా నా ప్రజల ఓట్లతో ఓట్ల పెట్టె నుంచి రాజులు పుట్టేలా ఏర్పాటు చేసాను, అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను..
కృపాలాని: అయితే నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు..
ఎందుకంటే నీ ప్రజలు పేదవారు, నిస్సహాయులు, అడుక్కునే వాళ్లు, అమ్మడుపోయే వాళ్ళు..
మేము వారి ఓట్లు కొని మా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ప్రజల సొమ్మును దోచుకుని వాళ్ళని బిచ్చగాళ్లను చేస్తాం, నువ్ ఎం చేయలేవు..
రాజకీయ నేత : నా ప్రజలు పేదలే, నిస్సాహయులే, అడుక్కునే వారే, అమ్ముడుపోయే వారే..
వారి ఓట్లను కొని,
మీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు..
కానీ ఏ రోజు అయితే నా ప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో అప్పుడు మీకన్నా బిచ్చగాళ్ళు ఎవరు ఉండరు, అది గుర్తించుకొండి..
ఇది కధ కాదు జరిగిన సంఘటన..

నీ ఓటు విలువ నువ్ ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడు వరకు ఈ అవినీతిపరుల చేతుల్లో బలి అవ్వాల్సిందే. 🙏🙏
You can follow @LuckySmiley_1.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.